
బిచ్చగాళ్ల “వీర్యం”, అడ్డాకూలీల “అండం” అని వార్త పత్రికల్లో వచ్చిన విషయంపై లోతుగా విచారణ జరించాలని WHRPC ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
వివరాల్లోకి వెళ్ళితే
కొన్ని వార్త పత్రికల్లో వచ్చిన బిచ్చగాళ్ల “వీర్యం”, అడ్డాకూలీల “అండం” అనే వార్తపై తీవ్రంగా స్పందించిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ జాతీయ ఉపాధ్యక్షులు డా పీటర్ నాయక్ లకావత్.
ఈ నేపథ్యంలో బిచ్చగాళ్ల “వీర్యం”, అడ్డాకూలీల “అండం” అనేది సృష్టికి చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఒక ఆసాంఘిక కార్యక్రమంగా భావించి బాధపడుతున్నామని, ఇది మానవత్వానికి మాయని మచ్చ అని వారు పేర్కొన్నారు. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించి లోతుగా విచారణ జరిపి నేరస్థులపై వారు ఎంతటి వారైన విడిచిపెట్టే ప్రసక్తే లేదు చాలా కఠినంగా చర్యలు తీసుకుంటూ వైద్య రంగంలో ఎవరైన ఇందులో ఉన్నారేమో పరిశీలించి సంబంధిత హాస్పిటల్స్ ముసివేయాలని
వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డా. పీటర్ నాయక్ పోలీసులను కోరారు.
హైదరాబాద్ నగరంలో వెలుగుచూసిన ఈ అసహ్యకరమైన, మానవతా విరుద్ధమైన “వీర్యం, అండాల సేకరణ” వ్యాపారంపై డా. పీటర్ నాయక్ లకావత్, జాతీయ ఉపాధ్యక్షుడు — వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ తీవ్రంగా ఖండించారు.
“ఇది శరీర దందా కన్నా ప్రమాదకరమైన మానవ హక్కుల దుర్వినియోగం. మానవ శరీరాన్ని వస్తువుగా మలచే సంస్కృతి ఈ దేశంలో ఎప్పటికీ తట్టుకోబడదు. పేదలను ఆర్ధిక అవసరాల పేరుతో వాడుకుని వారి మనోబలాన్ని దెబ్బతీసే ఈ దారుణాలకు నేను తీవ్రంగా విరోధిస్తున్నాను. ఇది నేరం మాత్రమే కాదు — మానవ విలువలపై ఉగ్రదాడి,” అని డా. పీటర్ నాయక్ పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో బిచ్చగాళ్లు, రోజువారీ కూలీలు, చదువు లేని పేద ప్రజలను మభ్యపెట్టి వారి శరీర భాగాలను అసహ్యకరమైన లాభాల కోసం వాడుకోవడం మానవ హక్కుల చట్టాలకు స్పష్టమైన అవమానం అని ఆయన అన్నారు.
ముఖ్య డిమాండ్లు:
- ఈ నేరానికి పాల్పడిన వారిపై కఠినమైన శిక్షలు విధించాలి.
- ఇలాంటి క్లినిక్స్‌పై సర్వే నిర్వహించి, అనుమతులు రద్దు చేయాలి.
- బాధితుల పట్ల న్యాయం జరిగేలా పునరావాసం మరియు కౌన్సిలింగ్ కల్పించాలి.
- సమాజాన్ని అవగాహనతో చైతన్యవంతం చేయడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాలి.
సందేశం: “మానవ హక్కులు అమ్మకానికి లేవు. పేదల దేహాలను వాడుకోవడం ఇకనైనా ఆపాలి. మనిషి విలువను అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది.”
ఈ సందర్భంగా డా. పీటర్ నాయక్ గారు సంబంధిత ప్రభుత్వ శాఖలు, పోలీస్ విభాగాలు, మరియు సామాజిక సంస్థలకు ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు.