
కాంగ్రెస్ మాటలు.. నోటి మాటలని తెలిసిపోయింది
సమన్వయంతో పనిచేసి అన్ని స్థానాల్లో గెలుపు కోసం కృషి చేయాలి
బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
కాంగ్రెసొల్ల మాయ మాటలు నమ్మి మోసపోయాం అని ప్రజలు బాధపడుతున్నారని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు అన్నారు.
శుక్రవారం రోజున ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జూలూరుపాడు మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు హాజరై మాట్లాడారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలోని ఐదు మండలాలలోఅత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలు తలుచుకుంటూ కాంగ్రెసోళ్ల మాయమాటలతో మోసపోయామని మదన పడుతున్నారని అన్నారు.
అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మరిచిపోయిందని, ఆరు గ్యారంటిల ఉసులేదు, బంగారం ప్రీ, మహిళలకు నెలకు 2500 / వృద్దాప్య పింఛన్లు పెంపు జాడ లేకుంట పోయాయని విమర్శించారు. రైతు డిక్లరేషన్..యూత్ డిక్లరేషన్. .ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్ల పేరుతో మొత్తం 420 హామీలను ఇచ్చి నేడు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు.
బీఆర్ఎస్ శ్రేణులు నిరోత్సాహపడాల్సిన అవసరం లేదని, అధికారం ఉన్న లేకున్నా మనం ప్రజల పక్షమేనని అన్నారు. కోల్పోయింది అధికారమేనని, పోరాట పటిమ అలాగే ఉందన్నారు.
రాబోవు రోజుల్లో ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటాలని వైరా నియోజకవర్గంలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అన్ని స్థానాల్లో గెలుపొందే విధంగా కృషి చేయాలని లకావత్ గిరిబాబు గారు పిలుపునిచ్చారు,.
ఈ సమావేశంలో కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ చాపలమడుగు రామ్మూర్తి, లకావత్ హేమ్లా బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భూక్యా దేవిలాల్ నాయక్, తాళ్లూరి రామారావు, పురస్తపురపు రామకృష్ణ, పోతురాజు కృష్ణ మరియు తదితరులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,.