
బీసీ బిల్ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష పోస్టర్ ఆవిష్కరణ.
తెలంగాణ జాగృతి భద్రాద్రి జిల్లా ఇంచార్జ్ వీరన్న, తెలంగాణ రాష్ట్ర యుపిఎఫ్ కోఆర్డినేటర్ మంజుల ఆధ్వర్యంలో 72 గంటల దీక్ష పోస్టర్ ఆవిష్కరణ
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/భద్రాచలం ప్రతినిధి,( సాయి కౌశిక్)
ఆగస్టు 01,
ఆగస్టు 4 ,5 ,6 తేదీలో హైదరాబాద్ ఇందిరా పార్క్ లో బీసీ బిల్ సాధన కోసం తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరగనున్నటువంటి 72 గంటల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్ ఆంధ్రలో కలిసినటువంటి ఐదు గ్రామ పంచాయతీలు గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, ఎటపాక ఐదు గ్రామ పంచాయతీ లను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఒంటరి పోరాటం చేస్తున్నారని.
అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పోరాటం చేస్తున్నారని.ఇందులో ముస్లిం సోదరులకు ఎంత రిజర్వేషన్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి తెలపాలని
రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకటేనని ఇద్దరు కలిసే నాటకాలు ఆడుతున్నారని రేవంత్ రెడ్డికి తెలంగాణ పై ఎటువంటి చిత్తశుద్ధి ఉన్న బిసి సంక్షేమ సాధన కోసం రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని.
ఆగస్టు 4 ,5, 6 తేదీలలో హైదరాబాదు లో ఇందిరా పార్క్ లో జరగనున్నటువంటి 72 గంటల నిరాహార దీక్షను ముంపూ ప్రాంతప్రజలు భద్రాచలం నియోజకవర్గం అంత ప్రజలు కూడా విజయవంతం చేయాలని వారు అన్నారు.ఆంధ్రాలో కలిసి నటువంటి రాముల వారి భూములు కూడా తిరిగి తెలంగాణలోకి రావాలి అంటే ఐదు గ్రామ పంచాయతీ తిరిగి తెలంగాణలోకి రావాలని వారు అన్నారు