
ఫోన్ నంబర్‌ను ప్రేయసి బ్లాక్ చేసిందని యువకుడి ఆత్మహత్య
Web desc : ఐదేళ్లుగా ప్రేమించుకుని.. ఆ తర్వాత ప్రేయసి పక్కన పెట్టడంతో తీవ్ర మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం బోడబండ్లగూడెంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది.
బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన ఓ యువతితో ఏపూరి ప్రవీణ్(28) ఐదేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు.
ఇటీవల ప్రవీణ్ ఫోన్ నంబరును ఆమె బ్లాక్‌లో పెట్టడం, వేరే వ్యక్తితో తరచూ మాట్లాడుతున్నారు. ఈ విషయం తెలియటంతో ప్రవీణ్ మనస్తాపంతో బుధవారం సాయంత్రం బోడబండ్లగూడెంలోని తన ఇంట్లో గడ్డి మందు తాగి అపస్మారకస్థితికి చేరాడు.
చుట్టుపక్కలవారు గమనించి ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవీణ్ గురువారం రాత్రి మృతిచెందారు.
పంచనామా నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై అజయ్‌కుమార్ తెలిపారు.