
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్..
మంత్రి కొండా సురేఖకు భారీ షాక్ తగిలింది. మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే.. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్‌తో పాటు సమంత విడాకుల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)పై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది.
కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను BNS సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఈ నెల 21 లోపు నిందితురాలికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.
అంతేకాదు.. మంత్రి కొండా సరేఖ తరుపు న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను సైతం కోర్టు తోసిపుచ్చింది. కేటీఆర్ చేసిన ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని, సరైన సమాచారం లేదని, ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ పరిధి తదితర అంశాలపై వారు లేవనెత్తిన అంశాలను కోర్టు తోసిపుచ్చింది.
కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయని కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ పోగుల చేసిన వాదనతో ఏకీభవించిన కోర్టు, నిందితురాలిపై కేసు నమోదు చేయవచ్చని తేల్చిచెప్పింది.