
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆర్టిఐ కమిషనర్ శ్రీనివాస్.
ఆర్.టి.ఐ ఫిర్యాదులను పరిశీలన.
ఫిర్యాదులపై తక్షణ సమాచారం అందించాలి.
ప్రభుత్వ కార్యాలయాలలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించాలి.
ఆర్టిఐ 15 అంశాలను చార్ట్ పై ప్రదర్శించాలి.
సి కె న్యూస్ ప్రతినిధి కొలిశెట్టి వేణు, తిరుమలాయపాలెం,ఆగష్టు 3:
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీనివాస్ అన్నారు.. తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.. ఆర్టిఐ ద్వారా వచ్చిన ఫిర్యాదులను,అమలును ఆయన పర్యవేక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..
ఈ చట్టం ప్రకారం, పౌరులకు ప్రభుత్వ సమాచారాన్ని పొందే హక్కు ఉన్నదని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు.ఆస్పత్రి సిబ్బంది రోగులకు అందిస్తున్న సేవలను గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో అన్ని రకాల సేవలందించేందుకు అవసరమైన సిబ్బంది, ఖాళీల వివరాలు సమర్పించాలన్నారు.
ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు ముందస్తు జాగ్రత్తలు సూచించాలని, వైద్య సహాయం అవసరం అనుకుంటే గర్భిణీలను ప్రసవ గడువు కంటే ముందే ఆస్పత్రిలో చేర్చుకోవాలని అన్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలని సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
100 పడకల ఆసుపత్రి అయినప్పటికీ మౌలిక సదుపాయాల విషయంలో లోపాలు ఉన్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆయన దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అమలు చేయాల్సిన విషయాలు కూడా వారి దృష్టికి తీసుకొచ్చారని ఆయన అన్నారు.
సమాచార హక్కు చట్ట ద్వారా అమలు చేయవలసిన 15 అంశాలను ఆసుపత్రిలో చార్ట్ పై ప్రదర్శించాల్సిన అవసరం అధికారులకు ఎంతైనా ఉన్నదని ఆయన అన్నారు. సమాచార హక్కు చట్టం ప్రకారం వారికి కావలసిన సమాచారం అందించాలని ఆస్పత్రి సిబ్బందికి తెలియజేశారు.
వారి దగ్గరికి రెండు ఆర్టిఐ ఫిర్యాదులు మాత్రమే వచ్చాయని వారికి సమాచారం ఇచ్చామని ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారన్నారు.ప్రజలకు సకాలంలో సమాచారం అందేలా చూడటానికి, ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు.