
ఎప్పటికీ పూర్తవుతుంది రైల్వే బ్రిడ్జి
ఇంకెంతకాలం ఈ నరకయాతన…?
చటాన్ పల్లి గుంతల రోడ్డుతో తప్పని తిప్పలు
తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు
సి కే న్యూస్ షాద్ నగర్:ఆగస్టు 4
షాద్ నగర్ రైల్వే బ్రిడ్జి ఎప్పటికీ పూర్తవుతుంది ఎంత కాలం మాకు ఈ నరకయాతన అంటున్న ప్రజలు. ప్రతిరోజు అనేక రైలు రాకపోకల కారణంగా చట్టంపల్లి రైల్వే గేట్ దగ్గర గేటు పడ్డ ప్రతిసారి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అలాగే చటాన్ పల్లి నుంచి రిజిస్టర్ ఆఫీసు వరకు సాగిన ప్రధాన రహదారి గుంతలతో నిండిపోయి ప్రజలకు నరకయాతనను మిగిలిస్తోంది.
నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగుతున్న ఈ మార్గం ఇప్పుడిక తీవ్ర ప్రమాదాలకు దారితీసే స్థితికి చేరుకుంది. ఈ రోడ్డులో చోటుచేసుకుంటున్న ప్రతీ గుంత ప్రయాణికుల నష్టం కలిగించేలా మారుతున్నాయి.
వర్షాలు పడిన ప్రతీసారీ ఈ రహదారి మరింత ప్రమాదకరంగా మారుతుండటం, ప్రజలు నీటి లోతుల్లో వాహనాలతో కిందపడిపోతూ గాయాలపాలవుతున్న సంఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి.
ఈ పరిస్థితులపై పలుమార్లు స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి స్పందన లేకపోవడం బాధాకరమని వాపోతున్నారు.ఇది నగరానికి ద్వారంగా నిలిచే ప్రధాన రహదారి.
అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రజల ఇబ్బందులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాత్కాలికంగా అయినా మరమ్మతులు చేపట్టి వాహనదారులకు ఉపశమనం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలని, ఈ సమస్యను ప్రత్యేక చొరవ చూపి తక్షణమే ఈ రహదారి మరమ్మతులు చేపట్టాలి. ఇది సాధారణ అభివృద్ధి కాదు, ప్రజల ప్రాణాలతో కూడిన బాధ్యతగా గుర్తించి, ప్రజల సమస్యల పట్ల చలనం కనబరచాలని ప్రజలు వేడుకుంటున్నారు.