
సబితా ఇంద్రారెడ్డికి అవమానం… KTR షాకింగ్ ట్వీట్!
తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఎదురైన పరాభవం పై గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. సబితా ఇంద్రారెడ్డి పట్ల కాంగ్రెస్ నేతలు ఇలా వ్యవహరించడం దారుణం అంటూ ఫైర్ అయ్యారు.
మొదటి మహిళా హోం మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి పట్ల… కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ పోస్ట్ పెట్టారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి.. కావాలనే కాంగ్రెస్ ఇలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఓడిపోయిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం దారుణం అన్నారు.
పోలీసులు కూడా… కాంగ్రెస్ నేతలకు సపోర్ట్ గా నిలవడం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతోందని ఫైర్ అయ్యారు.
సబితా పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన పోలీస్ అధికారి కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ డిజిపి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
మూడు సంవత్సరాలలో తమ ప్రభుత్వం వస్తుందని… అప్పుడు అందరి పని చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా.. మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరగగా… అక్కడ సబితా ఇంద్రా రెడ్డికి ప్రోటోకాల్ సమస్య వచ్చింది. దీంతో వివాదం పెద్దదిగా మారింది.