
నిజాలు, రాస్తే పత్రికలపై ..నీందేలా …?
పత్రికలను, పాత్రికేయులనే బ్లాక్ మెయిల్ చేస్తున్న వైనం
అంగన్వాడి సెంటర్లను వదిలి సూపర్వైజర్ భజన
ఆగస్టు1న బదిలీ అయిన సూపర్వైజర్ సుధా
సూపర్వైజర్ కొరకు ఆర్భాటంలో ఆంతర్యం ఏంటి…? సీకే న్యూస్,దంతాలపల్లి. దంతాలపల్లి మండల పెద్దముప్పారం సెక్టార్లకు సూపర్వైజర్ గా పనిచేసిన సుధా అంగన్వాడి సిబ్బందిని పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేసి ఆత్మహత్యలే శరణ్యం అనే పరిస్థితికి తీసుకురావడంతో పత్రికా విలేకరులకు తెలియజేయడంతో పలు పత్రికలు పలు కథనాలు రాయడం తో జిల్లా అధికారులు బి డబ్ల్యూ శిరీష ఆదేశాల మేరకు సిడిపిఓ ఎల్లమ్మ తనిఖీ నిర్వహించి పలువురు ఆమె వల్ల మనిషి వక్షోభ గురయ్యామని మాకు ఆమె వల్ల ఆత్మహత్య శరణ్యమని ఆమె ఉంటే మాకు చావులే తప్ప మరేది లేదు అని మాకొద్దు సూపర్వైజర్ అని రాతపూర్వకంగా రాసి ఇవ్వడంతో ఈనెల 1వ తేదీన అధికారులు ఆమెను బదిలీ చేస్తున్నట్లు ఆర్డర్ ను ఇష్యూ చేయడం జరిగింది .
ఇది జరిగినా కూడా సూపర్వైజర్స్ సుధా ఎత్తుగడలు రాజకీయాలు చేస్తూ కొంతమంది టీచర్లను అంగన్వాడి సెంటర్లను ఆయాలకు వదిలిపెట్టి రెండు మూడు రోజుల నుండి కలెక్టర్ డీ డబ్ల్యూ సిడిపిఓ ఆఫీస్ లో చుట్టూ తిప్పుతూ నన్నే ఉంచేలా చేయాలని వారితో మీటింగ్లు పెడుతూ రాజకీయం చేస్తున్నది,
అంగన్వాడి సెంటర్లలో పిల్లలను ఆయాలకు వదిలేసి సూపర్వైజర్ భజన చేస్తూ ప్రెస్ మీట్ లో పాల్గొంటూ బదిలీ అయిన సూపర్వైజర్ కు ఉత్తసు పలుకుతూ అంగన్వాడి టీచర్ల పైన తక్షణమే ఉన్నది చర్య తీసుకోవాలని ఆయా సెంటర్లను తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు,
కొంతమంది టీచర్లకు ఇష్టానుసారంగా సెలవులు ఇచ్చి వాళ్ళని తొత్తులుగా ఉంచుకొని ఆమె ఇష్టానుసారంగా ఉద్యోగం నిర్వహించిన సూపర్వైజర్ కు వంత పాడుతున్న కొంతమంది టీచర్లు నిజాలు రాసిన పత్రికలపైనే ఫిర్యాదులు చేయించి పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు ఇలా చేస్తే పత్రికలు ప్రజలు ప్రజాస్వామికవాదులు సమాజము సహించదని తెలియవస్తుంది,
ఆగస్టు ఒకటో తేదీన బదిలీ అయిన సూపర్వైజర్ సుధా కు దంతాలపల్లి మండలం లో ఏం పని అత్యవసర సమావేశాలకు కారణమేంటి…
అంగన్వాడి సెంటర్ ను వదిలి సూపర్వైజర్ భజన చేపిస్తూ తిప్పడానికి కారణం ఏంటి ఎన్ని రోజుల నుంచి ఎంతమంది టీచర్లు అంగన్వాడి సెంటర్ లను వదిలారు సమగ్ర విచారణ జరిపించి వారిపై చర్య తీసుకోవాలని కోరుతున్న మండల ప్రజలు