
బర్త్ సర్టిఫికెట్ అడిగితే డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులు
కూసుమంచి తహశీల్దార్ కార్యాలయంలో అధికారుల తీరు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు
సి కె న్యూస్ ప్రతినిధి
సర్టిఫికెట్ ఇష్యూ చేసిన సంఘటన కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి మాద విద్య అనే బాలిక బర్త్ సర్టిఫికెట్ కోసం పుట్టిన ఆరు నెలల తరువాత దరఖాస్తు చేసుకోగా పంచాయతీలో రికార్డులు లేనందున తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోమని పంచాయతీ కార్యదర్శి చెప్పారు. కాగా సదరు బాలిక తల్లిదండ్రులు సంవత్సరం క్రితం బాలిక బర్త్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. అప్పటి నుండి అవి సరిగా లేవు.. ఇవి సరిగా లేవంటూ సెక్షన్ అధికారి గువ్వల వెంకటేశ్వర్లు కాలయాపాన చేశారు.
ఆగస్టు 4 వ తేది బర్త్ సర్టిఫికెట్ కోసం కార్యాలయానికి వెళ్లగా బర్త్ సర్టిఫికెట్ తహసీల్దార్ కార్యాలయం ముద్ర వేసి మరి చేతికి అందించాడు. బాలిక తల్లి మమత సర్టిఫికెట్ ను కాసేపాగి ఫోన్లో ఫొటో తీసుకున్న అనంతరం పరిశీలించగా…. బర్త్ సర్టిఫికెట్ బదులు డెత్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు గమనించింది. బాలిక తల్లి అధికారిని ఇది ఏమిటని అడుగగా వెంటనే ఆమె దగ్గర నుండి లాక్కొని చించి వేశాడు. మరల బర్త్ సర్టిఫికెట్ అందించాడు. కానీ అందులో ఎక్కడ డెలివరీ అయినా వివరాలు నమోదు చేయలేదు.
అది పంచాయతీ సెక్రటరికి చూపించగా హాస్పిటల్ వివరాలు మరల నమోదు చేపించాలని కార్యాలయానికి వచ్చి సార్ మా సర్టిఫికెట్లో హాస్పిటల్ వివరాలు నమోదు చేయమని అడిగితే నేను నీకు ఇది ఇవ్వడమే ఎక్కువ, అసలు నేను నీకు బర్త్ సర్టిఫికెట్ ఇవ్వను. తహసీల్దార్ ను వెళ్లి అడుక్కో పొ అంటూ ఆమెను తీవ్రంగా మందలించాడు. దీనితో వారు తహసీల్దార్ ను కలవడానికి వెళ్లగా తహసీల్దార్ రవి కుమార్ కోర్టు పని ఉండి కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఇంటికి వెళ్లారు. సదరు బాలిక తల్లి మమత ఇటువంటి తప్పులు చేసి మరల పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలను ఇష్టం వచ్చినట్లు దుషించే పేరు గువ్వల వెంకటేశ్వర్లు వంటి అధికారుల పై సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.