
కేటీఆర్ కి నేనేంటో చూపిస్తా… గువ్వల బాలరాజు హెచ్చరిక
అక్కడ కేటీఆర్‌ను అడుగు కూడా పెట్టనివ్వను
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం ఆయన ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడారు.
‘కేటీఆర్ నాకంటే పెద్దోడేమీ కాదు. ఆయన విదేశాల్లో చదువుకున్నాడేమో కానీ నాకున్న అనుభవం కేటీఆర్‌కు లేదు.
రాబోయే రోజుల్లో నేనేంటో కేటీఆర్‌కు చూపిస్తా. గ్రామాల్లో కూడా అడుగుపెట్టనివ్వను’ అని గువ్వల బాలరాజు హాట్ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉంటే.. నేడు గువ్వల బాలరాజు బీజేపీలో చేరబోతున్నారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారు.
బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. తనతో ఎవరూ రావట్లేదని.. తాను ఒక్కడినే పార్టీలో చేరుతున్నానని ఇప్పటికే గువ్వల బాలరాజు ప్రకటించారు.
గువ్వల బాలరాజు వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు పార్టీ నేతలు ఆయన మాటలను పట్టించుకోకపోయినా, మరోవైపు రాజకీయ వర్గాల్లో ఇవి హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బాలరాజు తరచూ కేటీఆర్‌పై ఈ తరహా ఘాటైన విమర్శలు చేస్తుండటంతో, ఇద్దరి మధ్య విభేదాలు మరింత బహిర్గతమవుతున్నాయి.
రాబోయే రోజుల్లో గువ్వల బాలరాజు ఈ విమర్శలతో ఏ దిశగా సాగుతారు, ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఇక కేటీఆర్ ఈ వ్యాఖ్యలకు ఎలా ప్రతిస్పందిస్తారో చూడాలి.