
బీజేపీలో చేరిన బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే…
అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఆదివారం (ఆగస్టు 10) నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజుకు రామచందర్‌రావు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.
శాలువా కప్పి ఆలింగనం చేసుకున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన గువ్వల బాలరాజు ఆ పార్టీ నుంచి రెండు సార్లు అచ్చంపేట ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. అంతకు ముందు అదే పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2014లో తొలిసారి బీఆర్ఎస్ నుంచి అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన.. 2018లోనూ అదే స్థానం నుంచి అదే పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసినా కాంగ్రెస్ అభ్యర్థి అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం వంశీకృష్ణపై ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ గువ్వల బాలరాజును నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలను అప్పగించింది. ఇంతకాలం ఆయన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు వహించారు. తాజాగా బీఆర్ఎస్ వీడి నేడు బీజేపీలో చేరారు.