
మద్యం మత్తులో ఓ వ్యక్తి పై మరో వ్యక్తి కత్తితో దాడి…
కన్నాయిగూడెం : మద్యం మత్తులో ఓ వ్యక్తి పై మరో వ్యక్తి కత్తితో దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన మండలంలోని సర్వాయి గ్రామంలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఏటూరు గ్రామానికి చెందిన మడే రాజు(36) సర్వాయి గ్రామానికి చెందిన నలబోయిన బేబీని వివాహం చేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా సర్వాయి గ్రామంలో ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
శనివారం అర్ధరాత్రి మాడె రాజు, కోరం రంజిత్ ఇరువురు మద్యం మత్తులో గొడవ పడడంతో క్షణికావేశానికి గురైన కోరం రంజిత్, మాడె రాజును కత్తితో దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు.
అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఏటూరునాగారం వైద్యశాలకు తరలిస్తున్న క్రమంలో మార్గ మధ్యంలో రాజు మృతి చెందినట్టు తెలిపారు. మృతుడికి భార్య బేబీ, కుమారుడు రజినీకాంత్, కూతురు రాధిక ఉన్నారు.