
గుండె ఆగినంత పనైంది.. ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం..
ఎయిర్ ఇండియాను వరుస సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి.. గుజరాత్ ప్రమాదం మర్చిపోకముందే చావు వరకు వెళ్లొచ్చాం అంటూ ఎంపీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలు ఎయిర్ ఇండియా ప్రయాణంపై ప్రయాణికుల్లో మరింత భయాన్ని రేకేస్తిసున్నాయి..
ఆదివారం తిరువనంతపురం నుంచి ఢిల్లీకి వెళుతున్న AI 2455 ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. తిరువనంతపురం నుంచి ఢిల్లీ బయలుదేరిన విమానం రెండు గంటల పాటు గాల్లో ఉండి చెన్నైలో ల్యాండ్ అయింది.
చెన్నైలో ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్ వే పై మరో విమానం ఉందని ప్రయాణికులు భయాందోళనలకు లోనయ్యారని..పెద్ద ప్రమాదం తప్పిందని.. అదృష్టం కొద్ది బయటపడ్డామని విమానంలో ఉన్న కేసి వేణుగోపాల్ వెల్లడించారు
కేసి వేణుగోపాల్ ఏమన్నారంటే
ఎయిర్ ఇండియా విమానంలో ప్రాణాపాయ ఘటన జరిగిందని ఎక్స్ లో పోస్ట్ చేసారు కేసి వేణుగోపాల్.. తిరువనంతపురం నుంచి ఆలస్యంగా బయలుదేరడంతో పాటు విమాన ప్రయాణం భయానకంగా మారిందన్నారు.
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో అల్లకల్లోలాన్ని ఎదుర్కొన్నామన్నారు.. విమానం బయలు దేరిన తరువాత దాదాపు గంట తర్వాత, కెప్టెన్ విమాన సిగ్నల్ లోపం ఉందని ప్రకటించి చెన్నైకి మళ్లించారు.
దాదాపు రెండు గంటల పాటు విమానాశ్రయం చుట్టూ ల్యాండ్ కావడానికి అనుమతి కోసం ఎదురుచూశామన్నారు. ల్యాండ్ అయ్యే మొదటి ప్రయత్నంలోనే గుండె ఆగిపోయే క్షణం వచ్చిందని రన్‌వేపై మరొక విమానం ఉన్నట్లు సమాచారం అందిదన్నారు..
కెప్టెన్ త్వరగా విమానాన్ని పైకి లేపడంతో ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డట్లు వెల్లడించారు.. రెండవ ప్రయత్నంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందన్నారు. పైలట్ నైపుణ్యం అదృష్టం ద్వారా బతికామన్నారు.
ప్రయాణీకుల భద్రత అదృష్టం మీద ఆధారపడి ఉండకూడదని.. సంఘటనను తక్షణమే దర్యాప్తు చేయాలని, జవాబుదారీతనాన్ని సరిదిద్దాలని ఇలాంటి లోపాలు మళ్లీ ఎప్పుడూ జరగకుండా చూసుకోవాలని డిజిసిఏ, విమానయాన శాఖ ను కోరారు.
కేసి వేణుగోపాల్ పోస్ట్ పై ఎంపీ మణికం ఠాగూర్ సైతం స్పందిస్తూ ప్రయాణికుల భద్రత అదృష్టంపై ఆధారపడకూడదు. దీనికి ప్రధాని మోదీ, రామ్మోహన్ నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..