
వాజేడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.
“మంగళవారం ప్రగల్లపల్లి మూలమలుపు వద్ద ప్రమాద ఘటన.”
“ద్విచక్ర వాహనం మరియు కార్ ఢీ”
“ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కార్ చతిస్గడ్ రాష్ట్రానికి చెందినదిగా అటుగా ప్రయాణిస్తున్న ప్రయాణికుల వివరణ”
“అసలు పోలీసులకు సమాచారం అందిందా.! లేదా.? అనే విషయం తెలియాల్సి ఉంది.”
“ములుగు జిల్లా సీకే న్యూస్”
ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగల్లపల్లి జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం సుమారు 9:30 ప్రాంతంలో ప్రగల్లపల్లి దేవర మర్రిచెట్టు మూలమలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..
ద్విచక్ర వాహనం పల్సర్ గా స్థానికులు గుర్తించారు.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఫోర్ వీలర్ కార్ చతిస్గడ్ రాష్ట్రానికి చెందిన వాహనంగా ప్రస్తుత సమాచారం..
ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీ కొట్టడంతో, సంఘటన స్థలంలోనే ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇద్దరికీ కూడా కాళ్లు విరిగినట్టుగా స్థానిక వివరణ…
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారులోనే క్షతగాత్రులను హాస్పిటల్ కి తీసుకువెళ్లినట్టుగా సమాచారం మరింత వివరాలు తెలియాల్సి ఉంది..