
సుబ్లేడు – మేడిదపల్లి గ్రామాల రాకపోకలు బంద్
భవనమ్మ ఆలయం సమీపంలో పొంగిపొర్లుతున్న వరద ప్రవాహం.
ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి..
జిల్లా కాంగ్రెస్ నాయకులు,బీరోలు సొసైటీ చైర్మన్ రామసహాయం నరేష్ రెడ్డి
సి కె న్యూస్, తిరుమలాయపాలెం.
రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమలాయపాలెం మండలంలోని సుబ్లేడు – మేడిదపల్లి గ్రామాల మధ్య గల భవానమ్మ ఆలయం సమీపంలోని వాగు పొంగి ప్రవహిస్తుండగా రాకపోకలు బంద్ చేశారు.
జిల్లా కాంగ్రెస్ నాయకులు,బీరోలు సొసైటీ చైర్మన్ రామసహాయం నరేష్ రెడ్డి,పంచాయితి కార్యదర్శి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వాగును సందర్శించి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భవానమ్మ ఆలయం సమీపంలో ట్రాక్టర్ అడ్డు పెట్టి రాకపోకలు జరుగకుండా నిలిపివేశారు.
ఆ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించాలని వారు కోరారు.మండలంలో అనేక వాగులు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నరేష్ రెడ్డి సూచించారు.