
రైస్ గ్రాండ్ రెస్టారెంట్లో మరోసారి కుళ్లిపోయిన బిర్యాని..
రెస్టారెంట్ లో కుళ్ళిపోయిన బిర్యాని పెడుతున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు
కొత్తగూడెం జిల్లాలో ఆహారతానిఖీ ఎక్కడ ?
కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు
జిల్లా లో జాడ లేని ఆహార తనిఖీ అధికారులు
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న గ్రాండ్ రైస్ హోటల్ నిర్వాహకులు.
ఎటువంటి అనుమతులు లేని ఈ రెస్టారెంట్ కి అండగా నిలిచేది ఎవరు ?
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
ఆగస్ట్ 13,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైస్ గ్రాండ్ హోటల్ మాయాజాలం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్ నిర్వాహకులు. రోజు రోజుకి కలుషిత మైన ఆహారం పెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైనం ఎన్నిసార్లు ఈ సంఘటన జరిగిన పట్టించుకోని ఆహార తనిఖీ అధికారులు .
అసలు భద్రాద్రి జిల్లాలో ఆహారతానిఖీకి అధికారులు లేకపోవడం రెస్టారెంట్లకు ఆడిందే ఆట పాడిందే పాటగా మూడు పువ్వులు ఆరుకాయలుగా వారి వ్యాపారాలు కొనసాగుతున్నవి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీకి ఆయువుపట్టు ఏజెన్సీలో రోడ్లు ఆక్రమించి నిర్వహిస్తున్న హోటల్స్ పై అధికారుల చర్యలేవి.
అడిగితే ప్రశ్నించే వ్యక్తులపై తిరుగుబాటు చేస్తున్న హోటల్ నిర్వాహకులు , కలుషితమైన ఆహారం పెడుతూ ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నారు మంగళవారం రోజు పాల్వంచకు చెందిన ముగ్గురు స్నేహితులు రైస్ గ్రాండ్ హోటల్లో బిర్యాని రుచికరంగా ఉంటుందని తినడానికి వచ్చిన వారికి చేదు అనుభవం ఎదురయింది .
కుళ్ళిపోయిన బిర్యానీ పెట్టారు. ఇదేమిటని ప్రశ్నించగా మీరు ఎవరికి చెప్పవద్దు అంటూ బేర సారాలకు దిగుతూ పది వేలు లేదా ఇరవై వేలు ఇస్తామని బిర్యాని తిన్న వ్యక్తులతోటి బ్యారసారాలు ఆడినట్టు బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తెలియజేస్తున్నారు.
ఈ సంఘటనతో బిర్యాని ప్రియులు ఉలిక్కి పడ్డారు మూడు నెలల క్రితం జరిగిన సంఘటన మరువక ముందే అదే హోటల్లో మరో సంఘటన చోటు చేసుకుంది బిర్యాని ప్రియులు విసిగెత్తిపోతున్నారు. మున్సిపాలిటీ అధికారులు
కానీ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని అనుమతులు లేని ఇటువంటి రెస్టారెంట్లను మూసివేయాల్సిందిగా పలు ప్రజలు కోరుతున్నారు వీరికి అండగా కొందరు రాజకీయ నాయకులు ఉండి వారికి ఎటువంటి అవసరం ఉన్న అవసరాలు తీరుస్తూ ఇటువంటి అక్రమ రెస్టారెంట్ నిర్మాణదారులకు అండగా నిలుస్తున్నారు
ఇప్పటికైనా వారు మేల్కొని అనుమతులు లేని రెస్టారెంట్లకు వత్తాసు పలకకుండా ప్రజలకు అండదండలుగా నిలవాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, ఇదేమిటని ప్రశ్నించినందుకు మమ్ములను బెదిరిస్తున్నారు
మంగళవారం రోజు జరిగిన సంఘటన హాస్పిటల్ లో ఉండటం వలన మేము బుధవారం రెస్టారెంట్లు వచ్చి అందరికీ పత్రిక సమూహంగా తెలియజేస్తున్నాము. ఫుడ్ ఇన్స్పెక్టర్ కి మంగళవారమే మేము తెలియజేసినప్పటికీ వారు బుధవారం రావడం ఏంటో అర్థం కాని పరిస్థితి ఉంది.
మంగళవారమే వస్తే ఫుడ్డు పాయిజన్ ఏ విధంగా అయిందో వాళ్లు పరిశీలించేవారు మరి బుధవారం రావడం లో ఆంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి ఇటువంటి అక్రమ రెస్టారెంట్లకు అండగా నిలుస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రెస్టారెంట్ కి వెళ్ళిన ముగ్గురిలో ఒక అతను గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. గవర్నమెంట్ వారు ఫుడ్ పాయిజన్ అని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ అంశమై బాధితులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.