
వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో చిన్నారులకు చేయూత.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, (సాయి కౌశిక్),
ఆగస్టు 13,
వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి భద్రాచలంలో శిశు మందిర్ లో చదువుతున్నటువంటి గిరిజన చిన్నారులు. సోయం భవ్య శ్రీ, భాను శ్రీ ఈ చిన్నారులకి చదువుకునే అవసరార్థం ఒక సంవత్సరం ఖర్చు కి రూ,, 17 వేల రూపాయలు అందజేశారు.
వీళ్ళది స్వగ్రామం చెలిమెల గ్రామం చర్ల మండలం తండ్రి లేక ముగ్గురు ఆడపిల్లల తోని ఒక అబ్బాయి తోని ఇబ్బంది పడుతున్న తల్లిని చూసి వనవాసి కళ్యాణ పరిషత్ జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ చెప్పగా హైదరాబాద్ కు చెందిన పెద్దాడ హితనంద్ ద్వారా తుమ్మలపల్లి. స్ఫూర్తి ఆడపిల్లల్ని చదివించడానికి ముందుకు వచ్చారు, ఈ కార్యక్రమంలో ప్రధాన ఆచార్య గీత మాత ఆ విద్యార్థుల కొరకు ఇచ్చిన ధనాన్ని తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి స్ఫూర్తి కి ధన్యవాదాలు తెలిపారు, ఇంత చిన్న వయసులోనే ఇలాంటి ఆలోచన గొప్ప విశేషం అని అభినందించారు, ఈ యొక్క కార్యక్రమం లో వనవాసి కళ్యాణ పరిషత్ ప్రాంత సహా మహిళా ప్రముఖు పెద్దాడ ఆశాలత. సరస్వతీ శిశు మందిర్ ప్రధాన ఉపాధ్యాయురాలు గీత, సూర్యనారాయణ, సింధు మాతాజీ, దుర్గ భవాని, సత్యనారాయణ, కడాలి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.