
శ్రీ చైతన్య స్కూల్, ఖమ్మం 1 బ్రాంచ్ లో “రైజింగ్ ఇండియా” కార్యక్రమం
సి కె న్యూస్ ప్రతినిధి
శ్రీ చైతన్య స్కూల్, ఖమ్మం 1 బ్రాంచ్ ఆగస్టు 13, 2025న “రైజింగ్ ఇండియా” కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా 20 సంవత్సరాలు భారత సైన్యంలో సేవలందించిన మాజీ ఆర్మీ సిబ్బంది అశోక్ బండారి హాజరై విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య సంస్థ చైర్మన్ శ్రీధర్ , డైరెక్టర్ శ్రీ విద్య, డీజీఎం చేతన్ , ప్రిన్సిపాల్ నివేదితా , వైస్ ప్రిన్సిపాల్ శశాంక్ యాచమనేని, డీస్ చంద్రశేఖర్ పాల్గొని విద్యార్థులకు “రైజింగ్ ఇండియా” యొక్క ప్రాధాన్యం మరియు భారతదేశాన్ని ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర గురించి విలువైన సందేశాలు అందించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు “రైజింగ్ ఇండియా” కోసం ర్యాలీ నిర్వహించి, నినాదాలు చేస్తూ దేశభక్తి సందేశాన్ని వ్యాప్తి చేశారు.