
హైదరాబాద్ సిటీలో ఈ ఏరియా వాళ్లకు GHMC అలర్ట్
హైదరాబాద్ సిటీకి వర్ష బీభత్సం పొంచి ఉంది. సిటీలోని ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, కుండపోత వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది జీహెచ్ఎంసీ.2025, ఆగస్ట్ 13వ తేదీ బుధవారం రాత్రి.. సిటీ మొత్తం భారీ వర్షం ఉన్నా.. అతి భారీ వర్షాలు మాత్రం GHMC నార్త్ ఏరియాల్లో పడతాయని వార్నింగ్ ఇచ్చింది.
అతి భారీ వర్షాలు పడే ఏరియాలు : GHMC నార్త్ ఏరియాలు.. అంటే కూకట్ పల్లి, మూసాపేట, కుత్బుల్లాపూర్, గాజులరామారం, ఆల్వాల్ ఏరియాల్లో ఈ రాత్రి కాళరాత్రి అనే హెచ్చరికలు వస్తున్నాయి. 20 సెంటీమీటర్ల వరకు వర్షం పడే ఛాన్స్ ఉందని వార్నింగ్ ఇచ్చింది జీహెచ్ఎంసీ.
జీహెచ్ఎంసీ నార్త్ ఏరియాల్లో.. అంటే ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షంతోపాటు ఈదురుగాలులు ఉంటాయని హెచ్చరించింది. ఆ సమయంలో కరెంట్ పోతుంది.. చెట్లు కూలిపోవచ్చు.. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవచ్చు.. రోడ్లు జలమయం అవుతాయని ముందుగానే అలర్ట్ ఇచ్చింది జీహెచ్ఎంసీ.
జీహెచ్ఎంసీ నార్త్ ప్రాంతంలో ఉండే కూకట్ పల్లి, మూసాపేట, కుత్బుల్లాపూర్, గాజులరామారం, ఆల్వాల్ ప్రాంతాల్లో ఉండే జనం ముందుగానే అప్రమత్తం అవ్వండి. అన్ని పనులు ముగించుకుని త్వరగా ఇళ్లకు చేరండి. కరెంట్ పోవచ్చు.. రావటానికి చాలా సమయం పడుతుంది..
ఛార్జింగ్ లైట్లు రెడీ చేసుకోండి.. కొవ్వొత్తులు పెట్టుకోండి. సెల్ ఫోన్లను ముందుగానే ఫుల్ ఛార్జ్ పెట్టుకోండి. మీ ఇల్లు లేదా అపార్ట్ మెంట్ లోకి నీళ్లు వచ్చే అవకాశం ఉంటే మాత్రం ముందుగానే వాహనాలను సురక్షితమైన ప్రాంతాల్లో పార్క్ చేసుకోండి.
ఈ రాత్రి అంటే.. 2025, ఆగస్ట్ 13వ తేదీ.. బుధవారం రాత్రి ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు.. అంటే 20 సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉండటంతో.. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవచ్చు. రోడ్లపై నీళ్లు నిలిచిపోవచ్చు. వాహనదారులు అప్రమత్తంగా చూసుకుని వెళ్లండి.
ఈ సమాచారం అంతా జీహెచ్ఎంసీ ఇచ్చిందే.. ముందస్తుగా అప్రమత్తం అవ్వండి.. ఇప్పటికే ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ డిజాస్టర్ టీమ్స్ రెడీగా ఉన్నాయి. మీరూ అప్రమత్తంగా ఉంటే ఈ గండం నుంచి ఈజీగా.. ప్రశాంతంగా గట్టెక్కొచ్చు.