
డిప్యూటీ సీఎం భట్టికి కేటీఆర్ సవాల్…
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం తన ఎక్స్ ఖాతా వేదికగా విమర్శలు గుప్పించారు.
దమ్ముంటే ఆరు గ్యారంటీలపై ఏ గ్రామానికైనా వెళ్లి చెప్పండి కాంగ్రెస్ మోసాన్ని భరించలేక.దమ్ముంటే ఇదే మాట తెలంగాణలోని ఏదైనా ఒక గ్రామానికి వెళ్లి ప్రజలకు చెప్పాలని సవాలు విసిరారు.
ఆరు గ్యారంటీల అమలుపైన కాంగ్రెస్ మోసాన్ని, ప్రాపగండాను చూసి కాంగ్రెస్ నేతలను గ్రామాల నుంచి తన్ని తరుముతున్నారని కేటీఆర్ తెలిపారు.
భట్టి విక్రమార్కకు, ఆయన క్యాబినెట్ మంత్రులకు దమ్ముంటే ఏదైనా ఒక గ్రామానికి వెళ్లి ఆరు గ్యారంటీలు అమలు చేశామని చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ గ్రామం నుంచి వీళ్ళని తరిమి వేయకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు.
గ్యారంటీ కార్డులు దాచుకోండి, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా ఒక్క గ్యారెంటీని సరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ మోసాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు.
కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాలి.. పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు . రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు వర్ష బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు అండగా నిలవాలన్నారు.
ఇప్పటికే అన్ని రంగాల్లో విఫలమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా, లేకపోయినా.. ప్రతిపక్షంగా మన బాధ్యత ఎక్కువని గుర్తుచేస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి త్రాగునీరు, పాలు, ఆహారం, మందులు, బట్టలు వంటి కనీస అవసరమైన సహాయాన్ని అందించాలన్నారు.
అత్యవసర వైద్య అవసరాల కోసం కూడా అవసరమైన చోట మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల్లో స్థానిక ప్రభుత్వ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని పిలుపునిచ్చారు