
నోటీసులకి పరిమితమైతే చర్యలు తీసుకునేది ఎవరు?
జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న అధికారులు
ఈ ప్రజా పరిపాలనలో పరిపాలన ఉందా ?
గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ అక్రమ నిర్మాణాలు.
జి ప్లస్ త్రీ నిర్మాణానికి సహకరిస్తున్న ఎంపీ ఓ సెక్రెటరీలపై చర్యలు తీసుకోవాలి.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ లక్ష్మీదేవి పల్లి ప్రతినిధి, ( సాయి కౌశిక్),
ఆగస్టు 14,
లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, మండలంలో జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాల జోరు మండల పంచాయతీ అధికారుల అండదండలతో నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నాయి.. గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ అక్రమ జి ప్లస్ త్రీ నిర్మాణాలు పూర్తికావచ్చినాయి.
ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న మండల అధికారులు. నోటీసులు అందజేశాము అంటూ ప్రత్యక్షంగానే అక్రమ నిర్మాణదారులకు సహకరిస్తున్నారు. నోటీసులు అందజేసిన తర్వాత మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు తెలవదా అని అనుకుంటున్న ప్రజలు.గత కొన్ని నెలలుగా నోటీసులు ఇస్తూనే ఉన్నారు.
అసలు అక్రమ నిర్మాణాలు జరిగేటప్పుడు పంచాయతీ మండల అధికారులు నిర్మాణ దారులకు నోటీసులు అందజేస్తారు మరి ఎన్ని నోటీసులు అందజేస్తారు. తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అన్నది ఇక్కడ సమస్యగా మారింది.
ఎవరు అడిగినా నోటీసులు అందజేశాము అంటున్నారు తప్ప తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంతుచిక్కని ప్రశ్న. అంత పెద్ద భవనం పూర్తి కావస్తుంది అంటే మండలాధికారుల అండదండలు లేవంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ అక్రమ నిర్మాణాలని ఆపాల్సిన అధికారులు వారికి అండగా నిలబడుతూ జి ప్లస్ త్రీ నిర్మాణం పూర్తయ్యే వరకు సహకరిస్తున్నారు. ఇంత పెద్ద అక్రమ నిర్మాణం జరుగుతున్న ఎంపీ ఓ కు కానీ పంచాయతీ కార్యదర్శిలకు కానీ కనిపించ లేదంటారా లేదా ఇంకా ఏమైనా జరిగింటుందా అని చర్చించుకుంటున్న ప్రజలు.
జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణానికి సహకరించుతున్న ఎంపీ ఓ లు పంచాయతీ కార్యదర్శిల పై చర్యలు తీసుకోవాలి అని కోరుతున్న ఆదివాసి నాయకులు ప్రజలు. అనుమాతులు లేకుండా నిర్మాణం మొదలుపెట్టిన మొదలుకొని జి ప్లస్ త్రీ నిర్మాణం పూర్తికావచ్చే వరకు అనగా కొన్ని నెలలుగా నిర్మాణం జరుగుతున్న అడ్డుకోకుండా ఏం చేస్తున్నట్టు తెలియాల్సిన ప్రశ్న.
మండల పంచాయతీ అధికారులు చేయవలసిన పనులు చేయకుండా జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తూ వారి నిర్మాణ పనులన్నీ పూర్తయ్యే విధంగా సహకరిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహమే లేదు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి జి ప్లస్ త్రీ నిర్మాణ దారులకు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని ఎంపీ ఓ సెక్రెటరీ లపై చర్యలు తీసుకోవాలి నిర్మాణాలను నిలుపుదల చేయవల సిందిగా కోరుతున్న ప్రజలు. మరి అధికారులు ఈ ప్రజా పరిపాలన ప్రభుత్వంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఎటువంటి చర్యలు చేపడుతారు వేచి చూడాల్సిందే.