
వాహనదారులకు తీపి కబురు..
79 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వార్షిక పాస్ విడుదల చేసిన జాతీయ రహదారుల సంస్థ ( ఎన్ హెచ్ ఎ ఐ )
వార్షిక రుసుము 3000/- తో 200 ఉచిత టోల్స్ ..
ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క వాహనాదరులు ఉపోయోగించుకోవాలి : Divya Karne (NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ )
నూతన టోల్ విధానాలపై నినాదం ప్రత్యేక కథనం…
వాహనాదారులు ఎప్పుడెప్పడా అని వేచి చూస్తున్న సువర్ణ అవకాశం జాతీయ రహదారుల సంస్థ ఆచరణలోకి తీసుకువచ్చింది.
79 వ స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా వాహనాదరులకు నూతన టోల్ విధానానికి రూపకల్పన చేసింది. కేవలం 3000 వేల వార్షిక రుసుము తో 200 టోల్ ప్రవేశాలకి అనుమతిని జారీ చేసింది.
భారతదేశంలో ని జాతీయ రహదారుల, ఎక్సప్రెస్ హైవే లపై వర్తింపు అయ్యేలా ఆగస్టు 15 ఉదయం 00 గంటల నుంచి అమల్లోకి రానున్న నూతన సదుపాయం తో సొంత వాహనాలు కార్ జీప్ వ్యాన్ లకు ఎంతగానో మేలు జరుగుతుందని అజయ్ మాణికుమార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అన్నారు.
వార్షిక పాస్ విధానాలు
ఫాస్ టాగ్ లో ఆక్టివేట్ చేయబడ్డ వార్షిక పాస్ కేటాయించబడ్డ జాతీయ రహదారి, జాతీయ ఎక్స్ప్రెస్ వే ప్లాజాలలో ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్పులకు ఉచితంగా ప్రయాణించడానికి అనుమతినిస్తుంది.
ప్రతి ట్రిప్పుకు (ఎంట్రీ మరియు ఎగ్జిట్ ) వినియోగదారులు రుసుము లేని విధమైన వార్షిక పాస్ ఆగస్టు 15 నుంచి అమలులోకి రాబోతున్నట్లు NHAI ప్రకటించింది .
ఈ వార్షిక పాసుని రాజ్ మార్గ్ యాత్ర మొబైల్ అప్లికేషన్ మరియు ఎన్ హెచ్ ఎ ఐ వెబ్సైట్లో మాత్రమే ఆక్టివేట్ చేయబడును.
వాహన సంబంధిత పాస్ టాగ్ యొక్క అర్హత ధ్రువీ ధృవీకరించబడ్డ తర్వాత వార్షిక పాస్ ఆక్టివేట్ చేయబడుతుంది.
రుసుము చెల్లించిన రెండు గంటల లోపు సంబంధిత రిజిస్టర్ పాస్ టాగ్ అమల్లోకి వస్తుంది.
ఏ ఒక్క వాహనదారుడు కొత్త పాస్ టాగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు వార్షిక రుసుము చెల్లించిన వెంటనే పాత పాస్ టాగ్ సాధారణ పాస్ లానే పనిచేస్తుంది.
వార్షిక పాస్ యాక్టివేషన్ తేదీ నుండి ఒక సంవత్సరం లేదా 200 లావాదేవీలకి చెల్లుబాటు అవుతుంది ఒక సంవత్సరం తర్వాత లేదా 2 వినియోగించబడ్డ తర్వాత సాధారణ ఫాస్టర్ లాగానే పని చేస్తుంది వాణిజ్యపరమైన వాహనాలకు ఇది వర్తింపజేయదు. ఏ వాహనానికైతే వాహన నంబర్తో లింక్ చేయబడ్డ వాహనానికి మాత్రమే ఇది వర్తింపజేస్తుంది.
ఒక జత ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఒక ట్రిప్పుగానే లెక్కింపబడుతుంది. మీరు వినియోగించబడ్డ లావాదేవీలు రాజ్ మార్గ్ యాత్ర యాప్ ద్వారా పరిశీలన చేసుకోవచ్చు. ఈ వార్షిక రుసుము విధానం తప్పనిసరి కాదు ఇప్పటికే ఉన్న ఫాస్ట్ ట్రాక్ పర్యావరణ వ్యవస్థ యధాతధంగా పనిచేస్తూనే ఉంటుంది.
మొదటి దశలో యాప్ మరియు వెబ్సైట్ ద్వారా 3000 రూపాయలు చెల్లింపు చేయడం ద్వారా మాత్రమే వార్షిక పాస్ ను ఆక్టివేట్ చేయవచ్చు మీ ఫాస్ట్ లో ఉన్న పాత బాలన్స్ ఈ నూతన విధానాలకు వర్తింప జేయదని సొంత వాహన దారులకు నూతన టోల్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.