
అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..
అందుకు నిరంతర కృషి జరుగుతోంది
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి
క్యాంప్ కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎంపీ రామసహాయం
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కొండబాల, మాజీ ఎమ్మెల్సీ బాలసాని, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి స్వర్ణ కుమారి, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ, కాంగ్రెస్ నేతలు మానుకొండ, కొప్పుల చంద్రశేఖర్ తదితరులు
ఖమ్మం: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా సుపరిపాలన అందిస్తోందని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం నగరంలోని గట్టయ్య సెంటర్ లో గల ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, తదితర నేతలతో కలిసి పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు పాలించిన గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. రూ. 2లక్షల రుణ మాఫీ, రైతు భరోసా, ఖరీఫ్ సీజన్ కు అవసరమైన విత్తనాల సరఫరా, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్తు, విద్యార్థి, యువజనుల వికాసానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తీరు మారాలి..
రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటూ.. పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల కోసం పలుమార్లు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసినప్పటికీ.. అటు నుంచి సహకారం కరువైందని ఎంపీ రఘురాం రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీరు మారాలని కోరారు.
ఈ కార్యక్రమంలో..: మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి, మాజీ మార్కెట్ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్, కాంగ్రెస్ నేతలు కొత్తా సీతారాములు, బెల్లం శ్రీనివాస్, దీపక్ చౌదరి, కొప్పుల చంద్రశేఖర్, మిక్కిలినేని నరేందర్, ప్రతిభా రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, టీఏసీ సభ్యులు ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ భాయ్, అనుబంధ సంఘాల బాధ్యులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పలుచోట్ల వేడుకలకు హాజరు: పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో, కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో, నూతన బస్టాండ్ వద్ద నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీ రఘురాం రెడ్డి పాల్గొన్నారు.