
డాక్టరేట్ మరియు సేవ రత్న అవార్డు అందుకున్న కందుల సుధాకర్
త్రోన్ ఆఫ్ గ్రేస్ వారు తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో కందుల సుధాకర్ చేసిన సామాజిక సేవను గుర్తించి డాక్టర్ తో పాటు సేవా రత్న అవార్డును బహుకరించారు.
స్వతంత్ర దినోత్సవ సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కందుల సుధాకర్ సామాజిక మరియు సమాజ సేవలను గుర్తించి ప్రజాసేవలో తెలంగాణ రాష్ట్ర జాగృతి పేరిట మరియు కరోనా సమయంలో నిత్యవసర వస్తువులు వస్త్రాల పంపిణీ, పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో సేవ చేసి, స్వచ్చ భారత్ పేరిట మొక్కలు నాటి సాంస్కృతిక రంగంలోనూ సంజీవని, మూఢనమ్మకాలు, ముక్కోటి కష్టాలు, ప్రేమ చల్లారిపోతుంటే, ఆత్మ పోరాటం, రచనలు చేసి కలం ఎత్తి వ్రాయించి గల నెత్తి పాడురా, రాజకీయాల్లో యువత పాత్రకు కాకతీయ యూనివర్సిటీ వరంగల్ నుండి అవార్డును అందుకున్నారు మరియు సామాజిక మాధ్యమాల్లో కె ఎస్ ఆర్ తెలంగాణ కేసరిగా మరియు కందల సుధాకర్ యూట్యూబ్ గా పలు నాటికలు సమాజంలో మూఢనమ్మకాలు తొలగించే ప్రయత్నం చేస్తూ వెటర్నరీ డిపార్ట్మెంట్లో మూగజీవాలకు సేవలందిస్తున్నారు 2015 సంవత్సరంలో దైవానుగ్రహం వల్ల కందుల రమాదేవి వివాహ మాడారు ప్రజాసేవ కార్యక్రమంలో ముందుకు సాగుతూ ఇంకా ఎక్కువగా అభిమానాలు పొందుకోవాలని ఆశతో ఉన్నానని ఈ అవార్డుకు తనని ఎంపిక చేసి డాక్టరేట్ మరియు సేవరత్న అవార్డును అందించిన త్రోన్ ఆఫ్ గ్రేస్ సంస్థ వారికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు