
పరిశోధనా రంగంలో పూరియా తండా వాసికి ఓయూ నుంచి డాక్టరేట్
సి కె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పూరియ తండా గ్రామానికి చెందిన బాదావత్ వీరు ఆంగ్లంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్ డి డాక్టరేట్ను పొందారు వీరు ఇంటర్మీడియట్ వరకు వారి సొంత మండలంలోని విద్యనభ్యసించినారు. ఆ తదుపరి ఉన్నత విద్యను హైదరాబాదులో పూర్తి చేయటం జరిగింది. ప్రొఫెసర్ బి. విజయ గారి పర్యవేక్షణలో ” A study of tradition and culture of nails Telangana” అనే పరిశోధన గ్రంథాన్ని సమీర్పించగా ఆయనకు డాక్టరేట్ లభించినట్లు పేర్కొన్నారు. కాగా వీరు ప్రస్తుతం నిర్మల్ జిల్లా, ఖానాపూర్ లోని మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వీరు కి తోటి ఉపాధ్యాయులు, తన కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.