
ఉత్తమ సేవా ప్రశంసా పత్రం అందుకున్న కన్నాయిగూడెం ఎస్సై
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్‌ఇన్స్పెక్టర్ ఇనిగాల వెంకటేష్ ఉత్తమ పోలీస్ సేవా ప్రశంసా పత్రం అందుకున్నారు.
శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, పోలీస్‌శాఖలో వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను సత్కరించారు.
ఈ సందర్భంగా కన్నాయిగూడెం సబ్‌ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్ఐ) వెంకటేష్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క చేతుల మీదుగా ప్రభుత్వ ఉత్తమ సేవా ప్రశంసాపత్రం ప్రదానం చేశారు.
కన్నాయిగూడెం మండలంలో పలుసేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ స్థానిక సమస్యలను తెలుసుకొని ప్రజలకు అండగా నిలిచిన ఆయన సేవలను గుర్తించి ఈ గౌరవం లభించింది.
ఉత్తమ సేవాపురస్కారం అందుకున్న ఎస్ఐ వెంకటేష్, పై అధికారులకు, తన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సబ్‌ఇన్స్పెక్టర్ వెంకటేష్‌కు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.