
పాలకుల నిర్లక్ష్యానికి ఇంకెంతమంది బలి కావాలి.?
“ఇర్ప లక్ష్మిది ముమ్మాటికీ ప్రభత్వ హత్యే.. ఆదివాసీ నవనిర్మాణ సేన జిల్లా అధ్యక్షులు కుంజ మహేష్”
“చని పోయిన కుటుంబాన్ని పరామర్శించని ఎమ్మెల్యే…”
“వేల కోట్ల రూపాయల గిరిజన ఉప ప్రణాళిక నిధులు ఏమవుతున్నాయి…?”
“లక్ష్మి పురం గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మహేష్…”
“బ్రిడ్జి లేక పోవడం కారణంగానే ఆదివాసీ మహిళ మరణం..”
“పది లక్షలు ఎక్స్ గ్రేసీయా చెల్లించాలని డిమాండ్..”
“సీకే న్యూస్ వెంకటాపురం మండలం ముల్తాని..”
వెంకటాపురం మండల కేంద్రంలో గిరిజన మహిళ ఆకస్మిక మృతి విషయమై ఇర్ప లక్ష్మిది ప్రభుత్వ హత్య అని ఆదివాసీ నవనిర్మాణ సేన జిల్లా అధ్యక్షులుకుంజ మహేష్ రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ఆరోపించారు. లక్ష్మి పురం నుండి మొట్ల గూడెం, రాచపల్లి, వెంకటాపురం వెళ్లే దారిలో వాగు ఉందని అన్నారు. ఈ వాగుకు బ్రిడ్జి కట్టక పోవడం వల్ల వాగు దాటే క్రమంలో ఆదివాసీలు వరదలో కొట్టుకొని పోయి చనిపోతున్నట్లు తెలియజేసారు. శనివారం ఆదివాసీ నవనిర్మాణ సేన జిల్లా అధ్యక్షులు కుంజ మహేష్ లక్ష్మి పురం గ్రామాన్ని సందర్శించారు. చనిపోయిన లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ ఆదివాసీలతో మాట్లాడినారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇర్ప లక్ష్మి చనిపోయిందని అన్నారు. పాలకుల నిర్లక్ష్యానికి ఇంకా ఎంతమంది ఆదివాసీలు బలి కావాల్సి వస్తుందో అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు . విధి నిర్వహణ లోనే వాగు దాటు తూ ఉండగా లక్ష్మి చనిపోయినందున ఆమె కుటుంబానికి ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసీయా చెల్లించాలని డిమాండ్ చేశారు. లక్ష్మి చనిపోయి నాలుగు రోజులు అయిన స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పి ఓ కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలవక పోవడం సిగ్గు చేటు అన్నారు. ఆదివాసీల చావులు వీధి కుక్కల చావుల కంటే హీనంగా ఉన్నాయని మండిపడ్డారు. ఆదివాసీలు వాగులు దాటుతూ చనిపోవడం ప్రజా పాలనా లక్ష్యమా.. అని ప్రశ్నించారు. వెంకటాపురం మండలానికి ఐదు కిలోమీటర్లు దూరం లో ఉన్న లక్ష్మి పురం ఆదివాసీ గూడెం ఏ రకంగాను అభివృద్ధి కి నోచుకోలేదని ఆయన అన్నారు. లక్ష్మి పురం గ్రామానికి చెందిన ఇర్ప లక్ష్మి ఆశా వర్కర్ గా పని చేస్తోందని అన్నారు. బుధవారం ఆమె తన విధులు నిర్వర్తించు కోని ఇంటికి వస్తున్న క్రమంలో గ్రామానికి అనుకోని ఉన్న పాలెం వాగు దాటుతూ అదుపు తప్పి నీళ్లలో పడి పోయి చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలుపు తున్నారని ఆయన అన్నారు. కొంతమంది అధికారులు లక్ష్మి మరణాన్ని వక్రీకరిస్తూ ఉన్నట్టు ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. లక్ష్మి పురం గ్రామం చుట్టూ వాగులు ఉన్నాయని అన్నారు. రోడ్డు మార్గం కూడా లేదని అన్నారు. వర్షాకాలం వస్తే బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నామని ఆదివాసీలు తమ గోడు చెప్పు కుంటున్నారని అన్నారు. ఈ గ్రామం లో ప్రాథమిక పాఠశాల లేదన్నారు. ఆదివాసీ బిడ్డలను దశాబ్దాలుగా విద్యకు దూరం చేస్తూ ఉన్నారని ప్రభుత్వం పై మండిపడ్డారు. ఏటూరునాగారం ఐటీడీఏ అధికారులు ఆదివాసీల సమస్యలను గుర్తించడం లో అలసత్వం వహిస్తూ ఉన్నారని అన్నారు. ఆదివాసీ గూడెలకు విద్య, వైద్యం, త్రాగు నీరు సాగు నీరు వంటి మౌలిక వసతులు కల్పించడం లో గిరిజనాభివృద్ధి సంస్థ విఫలం అవుతోంది విమర్శ చేశారు. కోట్ల రూపాయల జీతాలు ప్రతి నెల చెల్లిస్తూ .. ప్రాజెక్ట్ అధికారిగా ఐఏఎస్ లను పెట్టినా ప్రయోజనం శూన్యం అన్నారు. రాష్ట్రం లో ఇప్పటి వరకు గిరిజనాభివృద్ధి శాఖా మంత్రిని కేటాయించక పోవడం సిగ్గు చేటన్నారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 వేల కోట్ల రూపాయలు గిరిజన సబ్ ప్లాన్ నిధులు కేటాయించి నట్టు ఆయన పేర్కొన్నారు. కేటాయింపులు తప్ప ఖర్చు పెట్టేది శూన్యం అన్నారు. స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళు గడుస్తున్న ఆదివాసీ గూడెల్లో అభివృద్ధి జాడ దొరకడం అసాధ్యం అన్నారు. ప్రభుత్వానికి ఆదివాసీల పట్ల ఏ మాత్రం చిత్త లేదని విమర్శించారు. ఏళ్ల తరబడి లక్ష్మి పురం గ్రామ ఆదివాసీ బిడ్డలు విద్యకు దూరం అవ్వడానికి కారణం ప్రభుత్వం ఐటీడీ ఏ అధికారులే కారణం అన్నారు. ప్రజా పాలన.. బంగారు తెలంగాణ.. అభివృద్ధి చెందుతోంది ఇండియా.. అని పాలకులు ఇచ్చే నినాదాలు ఈ దేశ ములవాసులు అయిన ఆదివాసీలకు వర్తించవు అని పేర్కొన్నారు. కార్యక్రమం లో కంతి శంకర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు..