
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.
-అత్యవసర సమయంలో బయటకు వెళ్లండి
-విద్యుత్ పనిముట్లకు దూరంగా ఉండండి
-అత్యవసర సమస్యలు ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వండి
బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
వైరా నియోజకవర్గం
వైరా నియోజకవర్గ పరిధిలోని గ్రామాల ప్రజల విజ్ఞప్తి.. భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు గారు ఈ సందర్బంగా కోరారు.. ఏమైనా అత్యవసర సమయంలో మాత్రమే బయటకు వెళ్లాలి.. పాత ఇళ్లల్లో ఎవరైనా నివసించేవారు ఉంటే కొద్ది రోజులు తమకు తెలిసిన వారి ఇళ్లల్లో నివాసం ఉండగలరు.. కరెంటు స్తంభాలు, పనిముట్ల దగ్గరకు ఉండరాదు.. ఎక్కడైనా చెట్లు, స్తంభాలు, కరెంటు వైర్లు తెగిపడిన వెంటనే విద్యుత్, గ్రామ, పోలీసు వారికి సమాచారం ఇవ్వగలరు.. ఎక్కడైనా అధిక వర్షాలకు చెరువుల నుండి వాగులు పొంగిపోతున్నాచో వాటి పక్కన ఉన్న రోడ్ల పైకి వెళ్ళరాదు… రోడ్డుపై వాహనాలు వెళ్ళేటప్పుడు చిన్నగా జాగ్రత్తగా వెళ్ళగలరు.. అనవసరంగా ఇంటి నుండి బయటికి రావొద్దు… వర్షం కురిసినప్పుడు చెట్ల కిందికి స్తంభాల కిందకి వెళ్ళరాదు.. వెళ్లి పిడుగు పాటుకు గురికాకూడదు.. పిల్లలు యువకులు సెల్పులు తీసుకోవడానికి ఈతలు కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్బంగా ఆయన విజ్ఞప్తి చేశారు..