
బీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ వార్.. రప్పా.. రప్పా అంటూ..
సూర్యాపేట జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రప్పా.. రప్పా అంటూ ఫ్లెక్సీల వార్ మొదలైంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫొటోలతో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. సూర్యాపేటలో మరోసారి రప్పా రప్పా ఫీవర్ మొదలైంది.
నెల రోజుల క్రితం మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు కౌంటర్‌గా తాజాగా కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవాళ కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల ఇచ్చే కార్యక్రమానికి జగదీష్ రెడ్డి హాజరు కానున్నారు.
ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో కాంగ్రెస్ కార్యకర్తలు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి ఉత్తమ్ ఫొటోతో ఎదురొస్తే రప్పా.. రప్పా అంటూ రాసుకొచ్చారు.
ఫ్లెక్సీలు, హోర్డింగ్స్‌పై తెలంగాణ బెబ్బులి పులి – ఉత్తమ్ అన్న యువశక్తి అంటూ రాశారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట రాజకీయం ఆసక్తికరంగా మారింది.