
దళితుల భూములపై కన్నేసిన బడా బాబులు
మాకు న్యాయం చేయండి. దళితుడి ఆవేదన
అధికారులు దళితుడికి న్యాయం జరిగేలా చేస్తారా ?
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ చుంచుపల్లి ప్రతినిధి,
ఆగస్టు 21,
చుంచుపల్లి మండలం బాబు క్యాంప్ సున్నం బట్టి ఏరియాకి చెందిన మద్దాల గోవర్ధన్ బాబు క్యాంపు లోని మినీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చుంచుపల్లి మండలం, విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలోని తమ పూర్వీకుల భూమిపై జరుగుతున్న ఆక్రమణలపై ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు.
తమకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని కొందరు బినామీ వ్యక్తులు నకిలీ పత్రాలతో ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, దీనిపై తాము న్యాయపోరాటం చేస్తున్నామని మద్దాల గోవర్ధన్ తెలిపారు
మద్దాల గోవర్ధన్ తాతగారైన మద్దాల ఆనందం, తండ్రి లక్ష్మయ్య 1964లో సర్వే నెంబరు 17/1, 17/2 , 17/3లో ఉన్న 5.05 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
అప్పటి నుండి ఈ భూమి వారి ఆధీనంలోనే ఉంది. అయితే, మద్దాల ఆనందం మరణానంతరం, ఈ భూమి వారి కుమారుడు మద్దాల రాములుకు వారసత్వంగా సంక్రమించింది.
ఈ భూమిని తమ వద్ద నుండి కొనుగోలు చేసినట్లుగా, ఎం.వి. చౌదరి బినామీగా ఉన్న ఈసం నాగమణి, భర్త భైరెడ్డి సత్యనారాయణ నకిలీ పత్రాలను సృష్టించి, భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. దీనిపై మద్దాల కుటుంబం అప్రమత్తమైంది.
ఆక్రమణ ప్రయత్నాలను అడ్డుకుంటూ, తమ ఆస్తి హక్కులను కాపాడుకోవడానికి హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఇదే సమయంలో, కొలిశెట్టి వెంకటనర్సయ్య, తండ్రి రామయ్య (లేట్) తమ వద్ద నుండి ఈ భూమిని కొనుగోలు చేసినట్లుగా మరోసారి నకిలీ పత్రాలు సృష్టించారు. అంతేకాకుండా, వెంకటనర్సయ్య తన కుమారుడు కొలిశెట్టి రమణరావుకు 1048 చదరపు గజాల భూమిని వీలునామా ద్వారా రిజిస్ట్రేషన్ చేయించారు.
ఈ భూమిని కొలిశెట్టి రమణరావు, .2018న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలం, కోయగూడెం గ్రామ పంచాయతీ, రావులపాడుకు సంబంధించిన వ్యక్తులకు విక్రయించినట్లుగా పత్రాలు సృష్టించారు. మద్దాల గోవర్ధన్ మాట్లాడుతూ మా తాత కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని కొందరు దుండగులు నకిలీ పత్రాలతో ఆక్రమించుకోవాలని చూస్తున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. అధికారులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని, నకిలీ పత్రాలను రద్దు చేసి, అసలు యజమానులైన మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాము అని తెలిపారు మరి వీరికి ఎటువంటి న్యాయం జరుగుతుంది ప్రభుత్వ అధికారులు వీరికి అండగా నిలుస్తారా దళితులకు న్యాయం జరుగుతుందా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చుంచుపల్లి మండల వాసులు.