HyderabadPoliticalTelangana

ఎయిమ్స్‌లో 3,501 ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్ !

ఎయిమ్స్‌లో 3,501 ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్ !

ఎయిమ్స్‌లో 3,501 ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్ !

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), న్యూఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఉన్న ఇతర AIIMS కేంద్రాల్లో గ్రూప్-బీ, గ్రూప్-సీ నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది.నమొత్తం 3,501 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి నేడే చివరి తేదీ. ఇంకా దరఖాస్తు చేసుకొని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

విద్యార్హత..

పోస్టును బట్టి టెన్త్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంసీఏ, బీటెక్/ఎంటెక్/బీఈ, డీఎంఎల్‌టీ, బీఎంఎల్‌టీ, బీఫార్మసీ పాస్ అయి ఉండాలి. కొన్నిపోస్టులకు సంబంధిత రంగంలో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ అవసరం.

పోస్టుల వివరాలు..

డైటీషియన్
అసిస్టెంట్ డైటీషియన్
జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
ఫార్మసిస్ట్
టెక్నీషియన్
స్టాఫ్ నర్స్
లాబ్ టెక్నీషియన్
డెంటల్ టెక్నీషియన్
డేటా ఎంట్రీ ఆపరేటర్
డ్రైవర్
కాషియర్
ఓటి అసిస్టెంట్
రేడియోగ్రాఫర్
ఈసీజీ టెక్నీషియన్
మెకానిక్
CSSD టెక్నీషియన్
అటెండెంట్‌
పోస్టులు ఉన్నాయి.

వయస్సు పరిమితి..
కనీసం 18 ఏళ్లు – గరిష్ఠంగా 35 ఏళ్లు.

OBC అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు.

SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు.

దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు.

ఎంపిక విధానం.. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT), స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు.. జనరల్/ఓబీసీ: రూ.3,000, SC/ST/EWS: రూ.2,400

దివ్యాంగులకు: ఫీజు మినహాయింపు.

దరఖాస్తు విధానం.. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం అఫీషియల్ వెబ్‌సైట్: https://rrp.aiimsexams.ac.in/ ని చూడొచ్చు.

ఇంపార్టెంట్ డేట్స్.. దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 12
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 12, 2025

పరీక్షలు.. ప్రిలిమినరీ – సెప్టెంబర్ 14 , మెయిన్ పరీక్షలు – సెప్టెంబర్ 27

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button