
రాష్ట్ర కన్వీనర్ గా శ్రీకోటి జలంధర్ చారి
ఆగస్టు 25 ( సీ కే న్యూస్)
తెలంగాణ రాష్ట్ర ధూప, దీప, నైవేద్య కన్వీనర్ గా జన్నారం మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందిన శ్రీ కోటి జలంధర్ సారీ నియమితులయ్యారు.
ఆదివారం హైదరాబాదులోని హబ్సిగూడలో జరిగిన సమావేశంలో ఆయనను రాష్ట్ర కన్వీనర్ గా నియమిస్తూ అధ్యక్షులు పి.శ్రీకాంత్ ఆచార్యులు ఆదేశాలు జారీ చేసి నియామక పత్రాన్ని అందజేశారు.
శ్రీ కోటి జలంధర్ చారి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కమిటీల నిర్మాణం, సభ్యత్వ నమోదు నిర్వహిస్తారన్నారు. రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన శ్రీకోటి జలంధర్ చారిని పలువురు అభినందించారు.




