
దాతల కోసం ఎదురు చూపులు…
ఖమ్మం పట్టణానికి చెందిన నూకం వెంకటేష్ కండర క్షీణత వ్యాధితో బాధపడుతూ 16 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. ప్రభుత్వం చేయూతనిచ్చి తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. లేదా డెత్ ఇంజక్షన్ కు అనుమతిచ్చి ఈ నరకం నుండి విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు.
బాధితుడు వెంకటేష్ తో పాటు అతని భార్య లక్మి తెలిపిన వివరాలు. ఖమ్మం పట్టణంలోని 46 వార్డ్ పరిధి సారదినగర్ కు చెందిన 40 ఏళ్ల వెంకటేష్ 16 సంవత్సరాలుగా ముస్కులర్ డిస్ట్రోఫి (కండరాల క్షీణత) వ్యాధితో బాధపడుతున్నారు.
రోజురోజుకు కండరాలు క్షిణించి జీవచ్ఛవంలా మారరు. కదలలేక నడవలేక కాళ్లు, చేతులు పని చేయక సరిగా తినడం రాక మాటకే పరిమితమయ్యారు.
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరో ఒకరి సహాయం ఉండాలన్నారు. సహాయం లేనిదే రోజు గడవదు, కనీసం రోజూవారి కార్యక్రమాలు అంటే కాలకృత్యాలు, తినడం, తాగడం, పడుకోవడం, లేవడం కూడా చేసుకోలేనని అన్నారు.
ఎవరో ఒకరు పడుకోబెట్టి లేపాలని తెలిపారు. 16 సంవత్సరాలుగా తాను అనుభవిస్తున్న నరకం నుంచి విముక్తి కలిపించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
iభార్య అన్నీ తానై జీవచ్చవంలా ఉన్న తన భర్తకి సేవ చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ కుటుంబ భారాన్ని మోస్తుంది. కనీసం ఇంట్లో అవసరాలను కూడా తీర్చలేక ఇబంది పడుతున్నారు.
ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలి… కేవలం ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పెన్షన్ 4 వేల రూపాయలే తమకు ఆధారమని ఆస్తిపాస్తులు లేని తమకు ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నారు.
లేదంటే తనకు డెత్ ఇంజక్షన్ ఇచ్చి ఈ నరకం నుంచి విముక్తి కల్పించాలని బాధితుడు వెంకటేష్ వేడుకుంటున్నారు. అలాగే పెద్దలు దాతల ఎవరైనా ఉంటే ఆర్ధికంగా సహాయం చేయాలని కోరుకుంటున్నారు. పూర్తి వివరాలకు 9490395117.