
ఖమ్మం జిల్లాలో వరద స్థితిగతులపై కలెక్టర్ తో ఎంపీ రవిచంద్ర సమీక్ష
ఖమ్మం, ఆగస్ట్, 28:
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లాలో సంభవించే వరద స్థితిగతుల పై రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమీక్షించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ మేరకు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తో ఫోన్లో మాట్లాడి భారీ వర్షాలు, వరదల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి జిల్లాలో ఇబ్బంది లేదని, గురువారం కూడా భారీ వర్షం కురిస్తే వరదపోటు ఉండే ప్రమాదం ఉందని కలెక్టర్ తెలిపారు. ఒక వేళ అలాంటి పరిస్థితే వస్తే ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎంపీ వద్దిరాజు కు కలెక్టర్ అనుదీప్ నివేదించారు. ఒకవేళ వరద తలెతై పరిస్థితి వస్తే ఎదుర్కొనేందుకు బిఆర్ఎస్ నుంచి కూడా అవసరమైన సహకారం అందిస్తామని ఎంపీ రవిచంద్ర ఈ సందర్భంగా కలెక్టర్ కు తెలియజేశారు.