KhammamPoliticalTelangana

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కమిషనర్ సునీల్ దత్

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం పోలీస్ కమిషనర్ కీలక ప్రకటన

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

జలమయమైన రోడ్లు, వంతెనలు,వాగులు దాటే ప్రయత్నం చేయవద్దు..

అత్యవసర సమయాల్లో డయల్‌ 100, 1077..

ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు.

జిల్లాలో రెండు రోజులు గా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దన్నారు.

ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దని, పశువుల కాపర్లు చెరువులు, వాగులు దాటవద్దని, యువకులు సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దని సూచించారు.

ఇవాళ కూడా ఇదే పరిస్థితులు వుండే అవకాశం ఉందని వాతావరణం శాఖ హెచ్చరికల నేపథ్యంలో వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు.

అత్యవసర సమయాల్లో డయల్‌ 100కు, స్ధానిక పోలీసులకు, పోలీస్ కంట్రోల్ సెల్ నెంబర్ 8712659111, కలెక్టర్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ 1077, సెల్ నెంబరు 9063211298 సమాచారం ఆందిచాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button