
మోకాళ్ళ లోతు నీళ్ళలో నిలబడి వరద ప్రవాహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
సత్తుపల్లి పట్టణం- వేంసూర్ రోడ్డు,కాకర్లపల్లి రోడ్డు,సిద్ధారం రోడ్డు నందు భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి భారీగా వరద నీరు రోడ్లపై వస్తుండటంతో ఆఆ ప్రాంతాలను పరిశీలించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మరియు తామర చెరువును పరిశీలించారు..
లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ విజ్ఞప్తి చేశారు..
లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు..ఇళ్లల్లో చిన్నపిల్లలు ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, సత్తుపల్లి మున్సిపాలిటీ కమిషనర్ నరసింహ, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..