
తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు
ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
హనుమకొండలోని చైతన్య పురి, ఖమ్మంలో మరో చోట ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.
గతంలో హసన్ పర్తి, ఖాజీపేట మండలాల్లో పని చేసినప్పుడు నాగేశ్వర్ రావు పై అవినీతి ఆరోపణలు వచ్చాయి.
తనిఖీల తర్వాత వివరాలు ప్రకటిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.