
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా..
మాడ్గుల మండలం లో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన ఘటన చోటుచేసుకుంది. మాడ్గుల మండలంలోని సుద్ధపల్లి గ్రామానికి చెందిన ఐనవోని శివ గత కొన్ని సంవత్సరాల నుంచి నల్గొండ జిల్లా చింతపల్లి మండలం లోని తిరుమలాపురం గ్రామానికి చెందిన స్వాతి అనే యువతితో పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో కొంత కాలంగా పరిచయం పెంచుకొని ప్రేమిస్తున్నట్లు తిరిగి తనను లోబరుచుకున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో కొన్ని నెలలుగా ముఖం చాటేయడంతో శుక్రవారం ప్రియురాలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు నచ్చజెప్పుతున్నట్టు సమాచారం.