
సబ్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల చలామణి
జనగామ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తే ప్రభుత్వ అధికారి స్థానంలో
అక్రమ వసూళ్లకు స్పెషల్ రిక్రూమెంట్లు చేసుకుంటున్న పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల అధికారులు
ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా అనిషా అధికారుల సోదాలు జరుగుతున్న తీరు మారడం…?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై దృష్టి సారించిన అనీషా శాఖ అధికారులు. నిత్యం ఎక్కడో ఒక దగ్గర అనీషా కు పట్టుబడుతున్న అవినీతి తిమింగలాలు.
అయినా కూడా పలు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలలో ప్రభుత్వ అధికారుల కనుసన్నలలో ప్రైవేట్ వ్యక్తులు చలామణి అవుతున్నారు. కార్యాలయంలో జరిగే లావాదేవీలను చూసుకోవడానికి కొంతమందిని వ్యక్తిగతంగా నియమించుకుంటున్న సబ్ రిజిస్టర్లు.
ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులను తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశాలను జారీ చేసిన కూడా పెడచెవన పెడుతున్న సబ్ రిజిస్టర్లు.ఇదిలా ఉంటె జనగామ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఓ ప్రైవేటు వ్యక్తి ఆగడాలు అంతా ఇంతా కాదు.
ఏకంగా రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారితో నేరుగా వాగ్వాదాలకు దిగడం తరచూ జరుగుతున్న ఆ వ్యక్తిని తొలగించకుండా గవర్నమెంట్ అధికారి కూర్చునే స్థానంలో అతని కూర్చోబెట్టి చోద్యం చూస్తున్న సబ్ రిజిస్టర్. ఇదే విషయమై జనగామ సబ్ రిజిస్టర్ ని వివరణ కోరగా మా కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ లేరు అలాంటి వారు ఇక్కడ ఎవరూ పనిచేయడం లేదు అని తెలిపారు.
ఆ మరుసటి రోజే కార్యాలయంలో ఈసీ,సిసి, ఎంవి సర్టిఫికెట్స్ సెక్షన్లో ప్రభుత్వ ఉద్యోగి స్థానంలో కూర్చుని విధులు నిర్వర్తిస్తున్న ప్రైవేటు వ్యక్తి.
మా కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు లేరు అని వివరణ ఇచ్చిన అధికారికి ఆ ప్రైవేట్ వ్యక్తి కనిపించలేదా లేక కావాలనే ఆ వ్యక్తిని కాపాడుతున్నారా అర్థం కాని స్థితిలో ఆవేదన చెందుతున్న స్థానిక ప్రజలు.
ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తుల ఆగడాలకు కళ్లెంపడేనా లేక వారి అక్రమ వసూళ్లకు కేరాఫ్ అడ్రస్ గా ప్రైవేట్ వ్యక్తులు ఇంకా నిలుస్తారా వేచి చూడాలి.