
మెగా, అల్లు ఫ్యామిలీల్లో విషాదం!
మెగా, అల్లు ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. హీరో అల్లు అర్జున్ నానమ్మ, అల్లు అరవింద్ అమ్మ, అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (94) ఇకలేరు.
వృధాప్య కారణంగా అర్థరాత్రి సమయంలో ఆమె తుది శ్వాస విడిచారు. మధ్యాహ్నం తర్వాత కోకాపే లో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అయితే రామ్‌చరణ్ మైసూర్ నుంచి , బన్నీ ముంబై నుంచి మధ్యాహ్నానికి చేరుకోనున్నారు. అంత్యక్రియలకు అరవింద్, చిరంజీవి అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
పవన్, నాగబాబులు వైజాగ్ లో జరగనున్న పబ్లిక్ మీటింగ్ లో ఉన్నందున రేపు వచ్చి అల్లు కుటుంబాన్ని కలిసి సంతాపం తెలుపుతారు. కనకరత్నమ్మ అల్లు అర్జున్‌కు నానమ్మ కాగా.. రామ్‌చరణ్‌కు అమ్మమ్మ అవుతుంది.