
ఖాతాదారుల బంగారం దొంగలించిన బ్యాంకు ఉద్యోగులు
25 కిలోల బంగారం కాజేసి క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడ్డ బ్యాంకు మేనేజర్, క్యాషియర్
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకు లో పనిచేస్తూ క్రికెట్ బెట్టింగులో రూ.40 లక్షలు నష్టపోయిన క్యాషియర్ నరిగె రవీందర్
ఈ క్రమంలో తన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఖాతాదారుల బంగారం తాకట్టు పెట్టాలని బ్యాంకు మేనేజర్ ఎన్నపురెడ్డి మనోహర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్‌లతో కలిసి స్కెచ్ వేసిన రవీందర్
గతేడాది అక్టోబర్ నెల నుండి బ్యాంకులో 402 మంది పేరిట ఉన్న 25.17 కిలోల బంగారాన్ని బయటకు తీసి పాలు ప్రైవేటు గోల్డ్ లోన్ సంస్థల్లో తాకట్టు పెట్టిన నిందితులు
వచ్చిన డబ్బంతా రాజశేఖర్, ధీరజ్, కిషన్ అనే ముగ్గురు వ్యక్తుల ఖాతాల్లో జమ చేసిన తర్వాత, వారు కమీషన్ తీసుకొని రవీందర్ ఖాతాకు పంపినట్టు, ఈ డబ్బుతో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడ్డట్టు గుర్తించిన పోలీసులు
బ్యాంకు ఆడిట్ సమయంలో అవకతవకలు గుర్తించిన రీజినల్ మేనేజర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్యాషియర్, మేనేజర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో పాటు మరో 44 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
అదుపులోకి తీసుకున్న వారి దగ్గరినుండి 15.23 కిలోల బంగారం, రూ.1.61 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపిన రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా