
గ్రూప్-II అభ్యర్థులకు మెడికల్ పరీక్షలు… టీజీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల…!
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మరియు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన అర్హులైన అభ్యర్థులు తమ మెడికల్ పరీక్షల కోసం సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 4, 2025 మధ్య హాజరు కావాలి.
ఈ పరీక్షలు హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ వద్ద ఉన్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లోని MRD సెక్షన్, రూమ్ నెం. 507 లో ఉదయం 9:00 గంటల నుంచి నిర్వహించబడతాయి.
అభ్యర్థులు తమ హాల్ టికెట్ మరియు ఆధార్ కార్డుతో పాటు హాజరు కావాలి. మెడికల్ బోర్డు పరీక్ష ఫీజుగా రూ. 1000/- నగదు రూపంలో చెల్లించడంతో పాటు, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా సమర్పించాలి.
నిర్ణీత షెడ్యూల్‌లో మెడికల్ బోర్డుకు హాజరు కాలేకపోయిన అభ్యర్థుల కోసం సెప్టెంబర్ 8, 2025 (సోమవారం) తేదీని రిజర్వ్ డేగా ప్రకటించారు. ఈ తేదీ తర్వాత ఎలాంటి అభ్యర్థనలు స్వీకరించబడవని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యర్థులు ఈ ముఖ్యమైన తేదీని తప్పక గమనించాలని సూచించింది.