
పెట్రోల్ పోసి ఆటోకి నిప్పు.. పూర్తిగా కాలిపోయిన వాహనం
ఉండవెల్లి మండలంలోని బొంకూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ ఆటోకు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయిన ఘటన చోటు చేసుకుంది. ఆటో యజమాని రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
2018లో టీఎస్ 33టి 1396 గల ప్యాసింజర్ ఆటోను కొనుగోలు చేశాడు. ఆదివారం కర్నూలుకు వెళ్లి రోజు మాదిరిగా ఆటో నడిపి ఇంటికి వచ్చి నిలిపి ఉంచాడు.
మధ్యరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆటో పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు వ్యాప్తి చెందడంతో స్థానికులు గమనించి ఆటో యజమానికి చెప్పడంతో నీళ్లతో మంటలను ఆర్పివేశారు.
అప్పటికే ఆటో కాలిపోవడంతో యజమాని రాజశేఖర్ కన్నీటిపర్యంతం అయ్యారు. రోజు ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తూ ఉన్న ఒక జీవనాధారం కోల్పోయినట్లు బాధితుడు పేర్కొన్నారు.