
ఇద్దరు నూతన జాతీయ ప్రతినిధులను నియమించిన క్రైస్తవ హక్కుల రక్షణ సమితి
బిషప్.డా. అమృత్ కుమార్‌ను జాతీయ సాంస్కృతిక సంయుక్త కార్యదర్శిగా, శ్రీ రమణ తిమోతిని జాతీయ మీడియా ఇన్‌చార్జిగా నియమించారు. ఈ నియామక ఉత్తర్వులను సమితి జాతీయ అధ్యక్షుడు మరియు వ్యవస్థాపకులు బిషప్. డా. యిర్మీయా జారీ చేశారు.
ఈ సందర్భంగా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి జాతీయ ఉపాధ్యక్షులు & సౌత్ ఇండియా ఇన్‌చార్జి బిషప్. డా. పీటర్ నాయక్ లకావత్ మాట్లాడుతూ, దేశంలో క్రైస్తవులపై జరుగుతున్న అన్యాయమైన దాడులను ప్రతి భారతీయ పౌరుడు మానవత్వంతో ఖండించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండకు చెందిన బిషప్ డా. అమృత్ కుమార్‌కు సాంస్కృతిక సంయుక్త కార్యదర్శి పదవి, రమణ తిమోతికి మీడియా కన్వీనర్ పదవికి సంబంధించిన నియామక పత్రాలను అధికారికంగా అందజేశారు.
పాస్టర్ సునీల్ పిడుగు, జాతీయ ప్రతినిధి, మాట్లాడుతూ క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండించడం మాత్రమే కాకుండా, ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి రాజ్యాంగబద్ధమైన శాంతియుత ఉద్యమాలు జరపనున్నామని తెలిపారు. అనంతరం ఆయన కొత్తగా నియమించబడిన నాయకులకు అధికారిక గుర్తింపు కార్డులను అందజేశారు.
పాస్టర్ నెహెమ్యా, జాతీయ మీడియా కన్వీనర్, మాట్లాడుతూ ఇటీవల దేశంలోని అనేక ప్రాంతాలలో క్రైస్తవులపై దాడులు పెరుగుతున్నాయని, ఇటువంటి సంఘటనలు వ్యక్తుల మౌలిక స్వేచ్ఛను హరించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులపై కేసులు నమోదు చేయడంలో కూడా ప్రభుత్వాలు వెనకడుగు వేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంలో బిషప్ డా. అమృత్ కుమార్ మరియు శ్రీ రమణ తిమోతి జాతీయ అధ్యక్షుడు మరియు కమిటీ సభ్యులకు తమపై నమ్మకం ఉంచి జాతీయ స్థాయి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, క్రైస్తవ హక్కుల రక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తామని హామీ ఇచ్చారు.