
కవిత కామెంట్స్‌తో బీఆర్ఎస్‌లో అలజడి.. కేసీఆర్ ఇంటికి క్యూ కట్టిన నేతలు
ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు.
కవిత చేసిన వ్యాఖ్యలపై.. చర్చించనున్నట్లు సమాచారం. ఉదయం నుంచి మాజీ మంత్రి కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్‌తో మీటింగ్ తర్వాత బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది.
ఇప్పుడే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఎర్రవల్లి చేరుకున్నట్లు సమాచారం. మరికొందరు బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నుంచి ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు.
అయితే.. ఇప్పటి వరకు కవిత బీఆర్ఎస్‌లో ఉందా లేదా అన్నదానికి నేటితో తెరపడిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కవితపై బీఆర్ఎస్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందనే దానిపై సర్వాంత్ర ఆసక్తి నెలకొంది.