
భార్యని కడతేర్చి నేరుగా స్టేషన్ కు వెళ్లి లొంగిపోయిన భర్త…
వ్యసనాలకు అలవాటు పడిన ఆటో డ్రైవర్ వాటిని మానుకోవాలని చెప్పిన భార్యను కడతేర్చిన ఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో నివసిస్తున్న ఆటోడ్రైవర్ శంషీర్ పాషా అలియాస్ చోటే బాబా ఇంటిలో భార్య మహిముధాబేగం అలియాస్ సోనీ(30)ను గొంతు నులిమి హత్య చేశాడు.
అనంతరం నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. శంషీర్ పాషా ఆటో డ్రైవర్ వృత్తి చేస్తూ బెట్టింగ్ లకు అలవాటు పడ్డాడు.
దీంతో ఆర్థికంగా నష్టపోయిన మళ్ళీ అదే బెట్టింగ్ లలో డబ్బులు సంపాదించాలని అప్పులు చేసి మరి బెట్టింగ్ లకు పాల్పడడంతో భార్య మందలించింది. దీంతో ఆవేశంతో భార్యను గొంతు నులిమి హత్య చేశాడు.
అనంతరం స్థానిక పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. దీంతో బూర్గంపాడు ఎస్సై ప్రసాద్ హుటాహుటిన సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు.
స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.