
అద్దె చెల్లించలేదని ప్రభుత్వ బడికి తాళం..
పాఠశాల భవనం గేట్‌కు తాళం వేయడంతో రోడ్డుపై కూర్చున్న బాలలకు బోధన చేస్తున్న అంధుడైన ఉపాధ్యాయుడు.
అద్దె చెల్లించకపోవడంతో యజమాని ప్రభుత్వ పాఠశాల నిర్వహిస్తున్న భవనానికి తాళం వేసిన ఘటన కరీంనగర్‌లో బుధవారం చోటు చేసుకుంది.
ఖలీల్‌పురలోని ఓ అద్దె ఇంటిలో కుమార్‌వాడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కొనసాగుతోంది. 15 మంది బాలలుండగా ఒకరు అంధ ఉపాధ్యాయుడు ఉన్నారు. నాలుగేళ్లకుపైగా ఇంటి అద్దెను విద్యాశాఖ చెల్లించడం లేదు. దీంతో యజమాని భవనం గేట్‌కు తాళం వేశారు.
దీంతో పాఠశాల ముందే బోధన కొనసాగింది. సమగ్రశిక్షా సెక్టోరల్ అధికారి శ్రీనివాస్, ఎంఈవో కృష్ణమోహన్ అక్కడికి చేరుకోగా మరో పాఠశాలకు తరలించవద్దని తల్లిదండ్రులు అభ్యంతరం తెలుపగా వారికి సర్దిచెప్పి అమీర్‌నగర్‌లోని ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్లారు. అయితే అమీర్‌నగర్ ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం బడికి చేరుకుని అభ్యంతరం తెలపగా అద్దె భవనం యజమానితో మాట్లాడి తాళం తీయించారు.