
మాజీ స్టార్ క్రికెటర్‌కు ఈడీ నోటీసులు
భారత మాజీ స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అక్రమ బెట్టింగ్ యాప్‌తో మనీలాండరింగ్ జరిగిందని నేడు ఈడీ ధావన్‌ను ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆయనకు ఇవాళ నోటీసులు జారీ చేసింది.
1 ఎక్స్ బెట్ అనే అక్రమ బెట్టింగ్ యాప్‌తో సంబంధం కలిగి ఉన్నారంటూ మనీలాండరింగ్ కేసులో శిఖర్ ధవన్‌ను ప్రశ్నించనున్నారు. అయితే, 1 ఎక్స్ బెట్ సంస్థతో అతడు ఎండార్స్‌మెంట్లు చేసుకున్నాడని ఈడీ అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలోనే విచారణలో భాగంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద శిఖర్ ధవన్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. అయితే, గత నెలలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనాను కూడా ఈడీ ఇదే కేసులో ప్రశ్నించింది.
అనేక మంది పెట్టుబడిదారులను మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 1 ఎక్స్ బెట్ యాప్ సంస్థపై ఈడీ విస్తృతంగా విచారణ చేపడుతోంది.
కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చింది. యువత వ్యసనాలు, ఆర్థిక మోసాలను నిరోధించేందుకు కేంద్రం ఆలైన్ బెట్టింగ్ యాప్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.