
చిట్ ఫండ్ ఆఫీస్ లో మద్యం మత్తు లో ఇద్దరు వ్యక్తులు వీరంగం
సెప్టెంబర్ 04, ఖమ్మం : పట్టణం లో గట్టయ్య సెంటర్ లో గల ప్రైవేట్ చిట్ ఫండ్ సంస్థ లో బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతం లో పట్టణం లోని చెరువు బజార్ లో నివాసం వుంటున్న కస్తాల లక్ష్మణ్ రావు s/o రంగయ్య, లక్ష్మినారాయణ లు మద్యం సేవించి చిట్ ఫండ్ ఆఫీస్ లో కి వచ్చి సంస్థ సిబ్బంది పై అసభ్యకర పదజాలం తో దుసిస్తూ బ్రాంచ్ మేనేజర్ పై దాడికి యత్నం చేసారు.
లక్ష్మిణ్
రావు గతంలో సంస్థ లో రెండు నెలలు ఉద్యోగం, ఏజెంట్ గా పని చేసాడు. అతని తీరు బాగాలేక పోవడం వలన సంస్థ నుండి తీసివేశారు.
అతను సంస్థ పేరు చెపుతూ కస్టమర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నాడని కస్టమర్లు బ్రాంచ్ మేనేజర్ పిర్యాదు చేయగా, మేనేజర్ లక్ష్మణ్ రావు కు ఫోన్ చేసి ఇది మంచి పద్దతి కాదు వసూలు చేసిన డబ్బులు తిరిగి కస్టమర్ల కు ఇచ్చేయమని చెప్పాడు.
అట్టి విషయం ను దృష్టిలో పెట్టుకొని పై ఇరువురు మద్యం తాగి చిట్ ఫండ్ ఆఫీస్ కి వచ్చి సంస్థ సిబ్బంది, బ్రాంచి మేనేజర్ పై దాడి చేసారు. ఇట్టి విషయం పై ఖమ్మం పట్టణ టు టౌన్ పోలీస్ స్టేషన్ లో సంస్థ నిర్వకుడు పిర్యాదు చేయడం జరిగినది. వారిని విచారించి తగు చర్యలు తీసుకోవలని కోరారు.